– విజయ్ ప్రమాణ స్వీకారంలో స్పెషల్ అట్రాక్షన్ గా నటి త్రిష
– నీలిరంగు పట్టుచీరలో సంప్రదాయ వస్త్రధారణ
తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ తో ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఎన్ ఆనంద్, ఆధవ అర్జున, డాక్టర్ కేజీ అరుణ్ రాజ్, కేఏ సెంగొట్టియన్, పి.వెంకటరమణ, రాజమోహన్, డాక్టర్ కే.ప్రభు, కీర్తన, ఆర్ నిర్మల్ కుమార్, సెల్వి ఎస్ ఉన్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార వేదిక వద్దకు విజయ్ వైట్ షర్ట్, పంచెతో చాలా నార్మల్, క్లీన్ లుక్‌లో రాగా.. స్టేడియం మొత్తం ఆయన నినాదాలతో దద్దరిల్లిపోయింది.
చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో నటి త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. నీలి రంగు కంచి పట్టుచీర, జడలో మల్లెపూలు, వజ్రాలు, కెంపుల నెక్లెస్‌తో సాంప్రదాయబద్ధంగా ముస్తాబై అందరి దృష్టిని ఆకర్షించారు. స్టేడియంలోకి ఆమె అడుగుపెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారాయి. విజయ్ అభిమానులు, టీవీకే శ్రేణులు ఆమె రాకను విపరీతంగా షేర్ చేస్తూ నెట్టింట హల్చల్ చేశారు.
ఏదీఏమైన విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి త్రిష హాజరుకావడంతో.. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. విజయ్, త్రిషల జంట సిల్వర్ స్క్రీన్ పై ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే, గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ పలు కథనాలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ.. విజయ్ భార్య సంగీత ఆయనకు విడాకుల నోటీసులు పంపినట్లు ప్రచారం సాగింది. అంతేకాదు సంగీత ఆరోపించిన సదరు హీరోయిన్ త్రిషనే అంటూ సోషల్ మీడియా కోడైకూసింది. దీనికి తోడు, ఇటీవల జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్‌కు విజయ్, త్రిష కలిసి హాజరుకావడంతో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై మరింత విస్తృతంగా చర్చ జరిగింది.
TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…
TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…