Categories: Movie News

సినిమా తీసిన యూట్యూబర్.. భారత్‌లో వసూళ్ల వర్షం!

హాలీవుడ్‌లో ఓ చిన్న హారర్ సినిమా భారత్ లో సంచలనం సృష్టిస్తోంది. 26 ఏళ్ల కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ‘అబ్సెషన్’ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇప్పటివరకు మన దేశంలో రూ.79 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2026లో అతిపెద్ద హాలీవుడ్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.7.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, భారీ అంచనాలతో విడుదలైన ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ వసూళ్లను అధిగమించడం విశేషం. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో ‘అబ్సెషన్’ ప్రస్తుతం 28వ స్థానంలో ఉంది. ఇదే జోష్ తో మరో కోటి రూపాయలు వసూలు చేస్తే ‘అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ రికార్డును కూడా బ్రేక్ చేయడం ఖాయం.

ఈ సినిమా విజయంపై యూట్యూబర్, డైరెక్టర్ కర్రీ బార్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్‌లో తన సినిమాకు ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుందని తాను ఊహించలేదని అన్నారు. ప్రేక్షకులు సినిమాలోని సన్నివేశాలను రీక్రియేట్ చేస్తూ కామెడీ వీడియోలు చేయడం, ఫ్యాన్ ఆర్ట్ గీయడం వంటివి చూసి షాక్‌కు గురైనట్లు చెప్పారు. ఈ విజయం అల్గారిథమ్‌ల కంటే ఫిలిం మేకర్స్‌పై నమ్మకం పెంచడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంలోనే యువ దర్శకులు మంచి కాంట్రాక్టులు, క్రియేటివ్ కంట్రోల్ సాధించుకోవాలని సూచించారు. కాగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 334 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసింది.

ManaTV Team

Recent Posts

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…

6 hours ago

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…

6 hours ago

‘కలర్స్’ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్టర్‌తో ఏడడుగులు!

'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…

7 hours ago

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatv

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…

8 hours ago

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…

8 hours ago

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…

11 hours ago