Categories: India News

ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం.. గ్రూప్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ ధ్రువీకరించినప్పటికీ, ఆయన రాజీనామాకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

2017లో ఫ్లిప్‌కార్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన కల్యాణ్ కృష్ణమూర్తి.. 2018 నుంచి గ్రూప్ సీఈఓగా కొనసాగుతున్నారు. దాదాపు పదేళ్ల పాటు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, ఫ్లిప్‌కార్ట్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

మరోవైపు సంస్థ భవిష్యత్తుకు సంబంధించి పలు సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్లిప్‌కార్ట్ ఐపీఓపై నెలకొన్న అనిశ్చితి, కీలక ఉద్యోగుల నిష్క్రమణ, క్విక్ కామర్స్ రంగంలో పెరుగుతున్న పోటీ వంటి అంశాలు సంస్థకు సవాళ్లుగా మారాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా ఈ-కామర్స్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

ManaTV Team

Recent Posts

కార్తీక దీపం వెలిగించలేకపోయాం.. సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన తమిళనాడు ప్రభుత్వం

చెన్నై: కార్తీక దీపం వెలిగించే కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయినందుకు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు క్షమాపణలు కోరింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు…

1 hour ago

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5 నుంచి.. 15 రోజుల పాటు నిర్వహణకు కసరత్తు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి సుమారు 15 రోజుల పాటు సమావేశాలు…

2 hours ago

సాయి దత్త పీఠం శివ విష్ణు ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్‌లో ఉన్న సాయి దత్త పీఠం శివ విష్ణు ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు…

2 hours ago

Abby V and Band to Perform Live in Dallas on December 13

Dallas, Texas: Music lovers in Dallas are in for an exciting evening as Kalaakunchi, in…

5 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 25-11-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 25-11-26 Tirumala Update #thirupathi #manatvlive Tirumala Update #thirupathi #manatvlive…

6 hours ago

Gold Rate Today : 24K & 22K Prices 25-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv

Gold Rate Today : 24K & 22K Prices 25-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv #goldprice…

12 hours ago