అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ మహాసభల కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ, సినీ ప్రముఖుల సందడితో సభా ప్రాంగణం కళకళలాడింది. వేలాది మంది ప్రవాస తెలుగు ప్రజలు కార్యక్రమాల్లో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రవాస భారతీయుల సౌకర్యార్థం సుమారు రూ.20 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో ఎన్‌ఆర్‌ఐ భవన్ నిర్మించనున్నట్లు ప్రకటించారు.
ప్రవాస తెలంగాణవాసులు ప్రతి వారం కనీసం రెండు రోజులు తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందడమే కాకుండా స్థానిక కళాకారులు, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అదే వేదికపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. విదేశాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.
ప్రత్యేక సత్కారాలు.. పురస్కారాల ప్రదానం
మహాసభల సందర్భంగా ఆటా మాజీ అధ్యక్షులతో పాటు అమెరికాలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. భారత, అమెరికా సైన్యాల్లో విశిష్ట సేవలు అందించిన తెలుగు వీరులకు ప్రత్యేక పురస్కారాలు అందజేసి వారి సేవలను కొనియాడారు.
అహింసా సిల్క్‌తో ఆకట్టుకున్న ఫ్యాషన్ షో
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చనా కొచ్చర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పట్టుపురుగులకు ఎలాంటి హాని కలిగించకుండా సేకరించిన అహింసా సిల్క్ వస్త్రాలతో తెలంగాణ చేనేత కార్మికులు రూపొందించిన దుస్తులను మోడల్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ చేనేత కళా వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించారు.
నవ్వులు పూయించిన శివారెడ్డి
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తన వినోదాత్మక ప్రదర్శనతో సభికులను అలరించారు. ఆయన మిమిక్రీ, హాస్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వేడుకలకు సినీ నటి పూజా హెగ్డే, యువ హీరో అడివి శేష్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వేదికపై ప్రసంగించిన వారు ఆటా సభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాసభల విజయాన్ని అభినందించారు.
Don’t wait until you see the SOLD OUT announcement! Book your tickets now and join…
Saraswathi Puja – Devi Navaratri Celebrations Hindu Temple of Atlanta invites all devotees to participate…
We are hosting FREE GENAI TRAINING for everyone. Nov 7th – Nov 29th, 2026 100%…
అమెరికాలోని న్యూజెర్సీలో న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ వార్షిక బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను…
The Indian Culture Society of NJ (ICS of NJ) is organizing a grand Navratri Celebration…
ప్రజల ఆశీర్వాదమే తనను ముందుకు నడిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తిని…