న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఉన్న సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో హాజరై శ్రీకృష్ణుడి దివ్య దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జులన్ సేవ, రుక్మిణీ కల్యాణం, హరికథా గానామృతం, లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, తులసీ దళ అర్చన, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో కళకళలాడింది.
చిన్నారుల కోసం బాలకృష్ణ, రాధా వేషధారణ పోటీలు నిర్వహించగా, ఉట్టి కొట్టే వేడుక, భజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రుక్మిణీ కల్యాణం అనంతరం ప్రముఖ హరికథా విద్వాంసులు బ్రహ్మశ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన హరికథా గానామృతం భక్తులను విశేషంగా అలరించింది. శ్రీకృష్ణుడి లీలలు, తత్వబోధలను వివరిస్తూ సాగిన హరికథ భక్తులను ఆధ్యాత్మికంగా అలరించింది.
ఈ సందర్భంగా సాయి దత్త పీఠం ఫౌండర్ చైర్మన్ శ్రీ రఘుశర్మ శంకరమంచి మాట్లాడుతూ, శ్రీకృష్ణ జన్మాష్టమి అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ అని అన్నారు. మానవ జీవిత పరమార్థాన్ని బోధించిన శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ మహోత్సవాలను విజయవంతం చేయడంలో సహకరించిన భక్తులు, నిర్వాహకులు, వాలంటీర్లు, చిన్నారులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
“కృష్ణ సేవలో తరించిన భక్తులతో సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.”
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న లండన్‌లోని ఓ విలాసవంతమైన పెంట్‌హౌస్ ఇప్పుడు వేలానికి…
తన కెరీర్‌లో నటి త్రిష ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని మాళవిక మోహనన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘పేట’…
ఢిల్లీ శివారు ప్రాంతంలో ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ చోంగ్తమ్ విక్రమ్ సింగ్పై తాగుబోతుల ముఠా దాడి చేసిన ఘటన విషాదంగా…
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో పట్టుదలగా ఉన్నారని ఆయన ప్రత్యేక ప్రతినిధి…
#USMInfra Sandalwood Plantation: A High-Value Farming Opportunity #BusinessOpportunity #manatvlive #USMInfra #SandalwoodPlantation #SandalwoodFarming #Sandalwood #Chandan #Plantation…
Stay Strong Through Hard Times | Bhagavad Gita 2.14 కష్టాల్లో స్థిరంగా ఉండు — భగవద్గీత #manatv…