అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్‌లో ఉన్న సాయి దత్త పీఠం – శ్రీ శివ విష్ణు టెంపుల్‌లో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం పూల అలంకరణలు, దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
భక్తి, ఆధ్యాత్మికతతో పాటు తెలుగు మరియు భారతీయ సంస్కృతిని సమాజంలో కొనసాగించేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా భక్తులు పాల్గొంటూ వినాయకుడి ఆశీస్సులు పొందుతున్నారు.
సాయి దత్త పీఠం వ్యవస్థాపకులు రఘు శంకర మంచిగారి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.