అమెరికాలోని గ్రేటర్ బోస్టన్‌లో మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలు – 2026 ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక తెలుగు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ బతుకమ్మ ఆటపాటలతో ప్రాంగణమంతా సందడిగా మారింది. తెలంగాణ ఆడపడుచులు సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అత్యుత్తమంగా నిలిచిన పది బతుకమ్మలకు నిర్వాహకులు చీరలను బహుమతులుగా అందజేశారు. చిన్నారుల్లో కళాత్మక ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కళా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
ఉచిత ప్రవేశం, భోజన సదుపాయాలతో నిర్వహించిన ఈ వేడుకలు కుటుంబ సభ్యులు, చిన్నారులు, పెద్దలతో కళకళలాడాయి. ప్రవాస తెలంగాణ ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తూ బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
తెలంగాణ పూల పండుగ బతుకమ్మ గొప్పతనాన్ని అమెరికాలో చాటిచెప్పడంతో పాటు, ప్రవాస తెలుగు ప్రజల మధ్య సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేసేలా MATA బంగారు బతుకమ్మ వేడుకలు – 2026 సాగాయి.
లండన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా…
అమెరికాలోని న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్ (NJTA) ఆధ్వర్యంలో 17వ వార్షిక సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి,…
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని…
Dear Devotees, As part of the ongoing Devi NavaRathri celebrations, we warmly invite you and…
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ చాప్టర్, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ, దసరా సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 17-10-26 Tirumala Update #thirupathi #manatvlive Tirumala Update #thirupathi #manatvlive…