Categories: NRI Updates

లండన్‌లో ఘనంగా టాక్ చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు

లండన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. యూకే నలుమూలల నుంచి 2,000 మందికి పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఎంపీ రూత్ క్యాడ్బరీ, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌన్స్లో మేయర్ రణ్జిత్ గిల్, కౌన్సిల్ నాయకుడు శాంతను రాజావత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను చేనేత వస్త్రాల ప్రోత్సాహంతో నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను తీసుకొచ్చి గౌరీదేవికి పూజలు నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలు, కోలాటాలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. చిన్నారులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు.

దసరా సందర్భంగా శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అలాయ్ బలాయ్ కార్యక్రమంలో భాగంగా చేనేత శాలువాలు కప్పుకొని, జమ్మి ఆకులను బంగారంగా భావించి పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉత్తమ బతుకమ్మలకు బంగారు నాణేలు, ఇతర బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ, చేనేత కార్మికులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం చేనేత బతుకమ్మ, దసరా వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, విదేశాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్న టాక్ కార్యవర్గాన్ని అభినందించారు.

టాక్ నాయకులు, సభ్యులు, స్పాన్సర్లు, ప్రవాస సంఘాల ప్రతినిధులు ఈ వేడుకలను విజయవంతం చేశారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెబుతూ, చేనేతకు మద్దతుగా నిర్వహించిన ఈ సంబరాలు ప్రవాస కుటుంబాల్లో ఆనందోత్సాహాలను నింపాయి.

ManaTV Team

Recent Posts

గ్రేటర్ బోస్టన్‌లో ఘనంగా MATA బంగారు బతుకమ్మ వేడుకలు – 2026

అమెరికాలోని గ్రేటర్ బోస్టన్‌లో మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలు – 2026 ఘనంగా…

1 hour ago

న్యూజెర్సీలో ఘనంగా NJTA 17వ వార్షిక సద్దుల బతుకమ్మ వేడుకలు

అమెరికాలోని న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్ (NJTA) ఆధ్వర్యంలో 17వ వార్షిక సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి,…

2 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని…

5 days ago

Devi NavaRathri Celebrations – Day 7

Dear Devotees, As part of the ongoing Devi NavaRathri celebrations, we warmly invite you and…

5 days ago

వాషింగ్టన్ డీసీలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ, దసరా సంబరాలు

అమెరికాలోని వాషింగ్టన్ డీసీ చాప్టర్, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ, దసరా సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు…

5 days ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 17-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 17-10-26 Tirumala Update #thirupathi #manatvlive Tirumala Update #thirupathi #manatvlive…

5 days ago