మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) 3వ త్రైమాసిక బోర్డు సమావేశాన్ని న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నిర్వహించింది. ఈ సమావేశానికి మాటా అధ్యక్షుడు కిరణ్ దుద్దాగీతో పాటు బోర్డు సభ్యులు, కార్యవర్గ సభ్యులు, RVC సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.
సమావేశంలో ఇటీవల నిర్వహించిన రెండవ మాటా కన్వెన్షన్ విజయాన్ని సమీక్షించారు. అలాగే గత రెండేళ్లలో అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన స్థానిక కార్యక్రమాలపై చర్చించారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, కమ్యూనిటీ కోసం కొత్త తరహా కార్యక్రమాలను ప్రవేశపెట్టే అంశాలపై చర్చ జరిగింది.
మాటాకు ప్రస్తుతం 32 చాప్టర్లు ఉన్నాయని అధ్యక్షుడు కిరణ్ దుద్దాగీ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని చాప్టర్లను మాటా కుటుంబంలోకి తీసుకురావడంతో సంస్థను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, వివిధ రాష్ట్రాల్లోని సభ్యులతో సమన్వయాన్ని పెంచడం వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు.
మాటా తదుపరి బోర్డు సమావేశం 2026 డిసెంబర్ లేదా 2027 జనవరిలో లాస్ వెగాస్‌లో నిర్వహించనున్నట్లు కిరణ్ దుద్దాగీ తెలిపారు.
ఈ సమావేశంలో కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (BODs) సభ్యుల ఎన్నికతో పాటు, కొత్త మాటా బోర్డును ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
మాటా కార్యక్రమాలు, రెండవ కన్వెన్షన్ విజయవంతం కావడానికి సహకరించిన మాటా కుటుంబ సభ్యులందరికీ కిరణ్ దుద్దాగీ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
వినియోగదారులను వేధించే స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.…
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే…
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పనితీరు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్ష…
ఆధ్యాత్మిక గురువు విజయ్‌కుమార్, అలియాస్ కల్కి భగవాన్, అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో…
Edison, NJ: Musik Waves is presenting a Grand Diwali Mela on Sunday, October 25, 2026,…
న్యూఢిల్లీ: అస్సాం దినపత్రిక ప్రతిదిన్ నిర్వహించిన ‘ఇండియాస్ నెక్స్ట్ చాప్టర్’ కాంక్లేవ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని…