2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సమావేశం నిర్వహించారు. తొలిసారిగా 22 మంది జెన్-జీ (Gen Z) ప్రతినిధులతో ఆమె సమావేశమై, బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా యువ ప్రతినిధులు నగరాల్లో సరసమైన అద్దె గృహాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
అయితే, ఈ సూచనలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. యువత అభిప్రాయాలు బడ్జెట్ రూపకల్పనలో ఎంతవరకు ప్రతిబింబిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
సంప్రదాయం ప్రకారం జనవరి 29 లేదా 31, 2027న ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టి, ఫిబ్రవరి 1, 2027న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
The upcoming film Eetha has created history with a remarkable achievement in Pune, entering both…
యాక్షన్ కింగ్ అర్జున్ మరో భారీ పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న…
ప్రముఖ స్టాండప్ కమెడియన్, కంటెంట్ క్రియేటర్ సమయ్ రైనా యూట్యూబ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. తన యూట్యూబ్ ఛానల్‌కు…
బీసీల హక్కుల సాధన కోసం డిసెంబర్ 14న ఢిల్లీలో భారీ బీసీల జనభేరి నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ…
ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక సమాచారం. డిసెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొన్ని నిబంధనల్లో మార్పులు అమల్లోకి…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 27-11-26 Tirumala Update #thirupathi #manatvlive Tirumala Update #thirupathi #manatvlive…