చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న ఏపెక్ (APEC) సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెంట కనిపించిన నల్లటి బ్రీఫ్కేస్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ బ్రీఫ్కేస్ రష్యా అణ్వాయుధ కమాండ్ వ్యవస్థలో కీలకమైన ‘చెగెట్’ (Cheget) అని అధికారులు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
రష్యా అధ్యక్షుడికి సైనిక కమాండ్ వ్యవస్థతో సంప్రదింపులు జరిపేందుకు, అవసరమైన అణు ఆదేశాలను పంపేందుకు ఈ ప్రత్యేక పరికరం ఉపయోగపడుతుందని సమాచారం. రష్యా అణ్వాయుధ నియంత్రణ వ్యవస్థలో ఇది కీలకమైన భాగంగా పరిగణించబడుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లతో పుతిన్ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ బ్రీఫ్కేస్ కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ భద్రత, అణ్వాయుధ నియంత్రణ వ్యూహాల నేపథ్యంలో ఈ పరికరం ప్రాధాన్యతపై చర్చ జరుగుతోంది.
వికారాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. దోమ మండలంలోని దిర్సంపల్లి తండా పరిధిలో ఉన్న గోవింద్ బుడ్యా…
A grand Tulsi Vivah Mahotsav is being organized to celebrate the sacred wedding of Tulsi…
Overseas Friends of BJP-USA is organizing a special virtual session featuring Shri G. Kishan Reddy,…
Renowned Bollywood actress Shabana Azmi is all set to bring her acclaimed theatrical production ‘Kaifi…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 19-11-26 Tirumala Update #thirupathi #manatvlive Tirumala Update #thirupathi #manatvlive…
Gold Rate Today : 24K & 22K Prices 19-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv #goldprice…