Categories: Movie News

రజనీకాంత్ కొత్త చిత్రం.. టైటిల్ ప్రకటించిన కమల్ హాసన్

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు తలైవా173 అనే వర్కింగ్ టైటిల్ తో ఉన్న ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.

కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆపరేషన్ థియేటర్‌లో రజనీకాంత్, చేతిలో సర్జికల్ బ్లేడ్‌తో నిల్చొని ఉండగా… ఆయన కాలు కింద ఒక రౌడీ పడి ఉన్నట్టుగా ఈ పోస్టర్‌ ఉంది. దీంతో ఈ సినిమాలో రజనీ డాక్టర్‌గా కనిపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. టైటిల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ కమల్ హాసన్ ‘ధర్మమే వెల్లుమ్!’ (ధర్మమే గెలుస్తుంది) అని ట్వీట్ చేశారు.

నిజానికి ఈ ప్రాజెక్టుకు మొదట డైరెక్టర్ గా సుందర్ సిని ప్రకటించారు. కానీ ఆయన తప్పుకోగా, సీబీ చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. కానీ అనూహ్యంగా ఆయన కూడా ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. ఈ క్రమంలోనే ‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ, అశ్వత్ మరిముత్తు దర్శకత్వ బాధ్యతలను స్వీకరించారు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీతలు అనిబరివ్ ద్వయం స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ManaTV Team

Recent Posts

నేపాల్ లో వరదల కారణంగా హెలికాప్టర్ రెస్క్యూ #short #flood #NepalFlashFlood #breakingnews #nepal

నేపాల్ లో వరదల కారణంగా హెలికాప్టర్ రెస్క్యూ #short #flood #NepalFlashFlood #breakingnews #nepal #manatv #flood #shorts #NepalFlashFlood…

6 hours ago

#GayatriPoojaStores Beautiful Decoration Items #homedecoration #pooja #poojastar #manatvlive

#GayatriPoojaStores Beautiful Decoration Items #homedecoration #pooja #poojastar #manatvlive #GayatriPoojaStores #PoojaDecoration #DecorationItems #PoojaItems #PoojaDecorations #homedecoration #TempleDecoration…

6 hours ago

వరదల విలయం చివరికి మిగిలింది ఇదే #short #flood #NepalFlashFlood #breakingnews #nepal #manatv

వరదల విలయం చివరికి మిగిలింది ఇదే #short #flood #NepalFlashFlood #breakingnews #nepal #manatv #flood #shorts #NepalFlashFlood #NepalFlashFloodLive…

6 hours ago

Gold Rate Today : 22K & 24K Prices August 27 #short #goldrate #24kgold #22kgold #goldprice #manatv

Gold Rate Today : 22K & 24K Prices August 27 #short #goldrate #24kgold #22kgold #goldprice…

6 hours ago

అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట: నారా లోకేష్ #NaraLokesh #tdp #manatv

అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట: నారా లోకేష్ #NaraLokesh #tdp #manatv #NaraLokesh #Anantapur #Anantapuram #tdp #TeluguDesamParty #TDPNews…

1 day ago

Lokesh Praises Kalava Srinivasulu’s Dedication & Leadership #NaraLokesh #KalavaSrinivasulu #manatv

Lokesh Praises Kalava Srinivasulu’s Dedication & Leadership #NaraLokesh #KalavaSrinivasulu #manatv #NaraLokesh #KalavaSrinivasulu #TDP #TeluguDesamParty #AndhraPradesh…

1 day ago