న్యూజెర్సీలోని సోమర్‌సెట్ కౌంటీ కమిషనర్ పదవికిరాకేష్ గంట పోటీ చేస్తున్నారు. సోమర్‌సెట్ కౌంటీ రిపబ్లికన్ ఆర్గనైజేషన్ వివరాల ప్రకారం, ఆయన RLG Environmental సంస్థకు ప్రెసిడెంట్‌గా, Evergreen Geotech & Drilling సంస్థలో భాగస్వామిగా ఉన్నారు. అలాగే వారెన్ టౌన్‌షిప్ ప్లానింగ్ బోర్డ్, ఎన్విరాన్‌మెంటల్ కమిషన్‌లో సభ్యుడిగా ఉన్నారు.
రాకేష్ గంట ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NJIT) నుంచి ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆయనకు వ్యాపార రంగంతో పాటు కమ్యూనిటీ కార్యక్రమాల్లోనూ అనుభవం ఉంది.
ఇటీవల రాకేష్ గంట కమ్యూనిటీ సభ్యులు, స్నేహితులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోమర్‌సెట్ కౌంటీకి చెందిన పలువురు కమ్యూనిటీ సభ్యులతో ఆయన సమావేశమై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
రానున్న నవంబర్ 3, 2026 జనరల్ ఎలక్షన్లో తనకు మద్దతు ఇచ్చి ఓటు వేయాలని సోమర్‌సెట్ కౌంటీ ఓటర్లను రాకేష్ గంట కోరారు. న్యూజెర్సీ డివిజన్ ఆఫ్ ఎలక్షన్స్ ప్రకారం 2026 జనరల్ ఎలక్షన్ నవంబర్ 3న జరగనుంది.