తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి కోరగా, కేరళ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. తమ జెండర్‌ను ధ్రువీకరించే అధికారిక సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేసింది.
సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఆలయ ప్రవేశానికి అనుమతిస్తే సంప్రదాయాలు, ఆచారాలకు భంగం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంలో ఆలయ బోర్డు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపింది.
అయితే గతంలో కొందరు ట్రాన్స్‌జెండర్లు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.