Categories: NRI Updates

టిటిఎ నూతన అధ్యక్షుడిగా సహోదర్ పెద్దిరెడ్డి

అమెరికాలోని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) 2027–2028 సంవత్సరాల నూతన అధ్యక్షుడిగా సహోదర్ పెద్దిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వివిధ చాప్టర్ల ప్రతినిధులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

సంస్థ అభివృద్ధికి సహోదర్ పెద్దిరెడ్డి గతంలో అందించిన సేవలను గుర్తుచేసిన నాయకులు, ఆయన నాయకత్వంలో టిటిఎ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రవాస తెలంగాణ తెలుగు సమాజాన్ని మరింత ఏకతాటిపైకి తీసుకువచ్చేలా ఆయన పనిచేస్తారని, విద్య, సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక పరిరక్షణ, యువత భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ, సహోదర్ పెద్దిరెడ్డి అధ్యక్ష పదవీకాలంలో టిటిఎ కొత్త లక్ష్యాలను చేరుకొని, ఉత్తర అమెరికాలో తెలంగాణ తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలను చేపడుతుందని పేర్కొన్నారు. ఆయనకు అన్ని వర్గాల సభ్యులు సంపూర్ణ సహకారం అందించి, సంస్థను మరిన్ని విజయాల వైపు నడిపించాలని ఆకాంక్షించారు.

ManaTV Team

Recent Posts

7 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానానికి పిడుగు.. సేఫ్‌గా ల్యాండింగ్

పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు…

47 seconds ago

హూతీ స్థావరాలపై సౌదీ కూటమి భారీ దాడులు

యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని…

6 minutes ago

ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రం

ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. 15…

12 minutes ago

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…

7 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

8 hours ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 8-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 8-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…

8 hours ago