Categories: Movie News

విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా ‘త్రిష’!!

– విజయ్ ప్రమాణ స్వీకారంలో స్పెషల్ అట్రాక్షన్ గా నటి త్రిష
– నీలిరంగు పట్టుచీరలో సంప్రదాయ వస్త్రధారణ

తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ తో ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఎన్ ఆనంద్, ఆధవ అర్జున, డాక్టర్ కేజీ అరుణ్ రాజ్, కేఏ సెంగొట్టియన్, పి.వెంకటరమణ, రాజమోహన్, డాక్టర్ కే.ప్రభు, కీర్తన, ఆర్ నిర్మల్ కుమార్, సెల్వి ఎస్ ఉన్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార వేదిక వద్దకు విజయ్ వైట్ షర్ట్, పంచెతో చాలా నార్మల్, క్లీన్ లుక్‌లో రాగా.. స్టేడియం మొత్తం ఆయన నినాదాలతో దద్దరిల్లిపోయింది.

చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో నటి త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. నీలి రంగు కంచి పట్టుచీర, జడలో మల్లెపూలు, వజ్రాలు, కెంపుల నెక్లెస్‌తో సాంప్రదాయబద్ధంగా ముస్తాబై అందరి దృష్టిని ఆకర్షించారు. స్టేడియంలోకి ఆమె అడుగుపెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారాయి. విజయ్ అభిమానులు, టీవీకే శ్రేణులు ఆమె రాకను విపరీతంగా షేర్ చేస్తూ నెట్టింట హల్చల్ చేశారు.

ఏదీఏమైన విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి త్రిష హాజరుకావడంతో.. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. విజయ్, త్రిషల జంట సిల్వర్ స్క్రీన్ పై ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే, గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ పలు కథనాలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ.. విజయ్ భార్య సంగీత ఆయనకు విడాకుల నోటీసులు పంపినట్లు ప్రచారం సాగింది. అంతేకాదు సంగీత ఆరోపించిన సదరు హీరోయిన్ త్రిషనే అంటూ సోషల్ మీడియా కోడైకూసింది. దీనికి తోడు, ఇటీవల జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్‌కు విజయ్, త్రిష కలిసి హాజరుకావడంతో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై మరింత విస్తృతంగా చర్చ జరిగింది.

ManaTV Team

Recent Posts

కొడుకు కోసం కాజల్ అగర్వాల్ డెసిషన్..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…

14 hours ago

విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ రిపోర్ట్..క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…

15 hours ago

యాక్షన్ మోడ్‌లోకి చిరు.. హైదరాబాద్‌లో భారీ ఫైట్ సీక్వెన్స్ షురూ

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్…

15 hours ago

జెట్ స్పీడ్ లో అనిల్ రావిపూడి సినిమా.. షూటింగ్ లో పాల్గొన్న వెంకీ

టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ జెట్ స్పీడ్ లో…

17 hours ago

బిగ్ సర్‎ప్రైజ్.. ‘లెనిన్’ కు ఎన్టీఆర్ వాయిస్

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…

20 hours ago

సైకో మైండ్.. సియా గోయల్ పై సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్!!

పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…

20 hours ago