హాలీవుడ్‌లో ఓ చిన్న హారర్ సినిమా భారత్ లో సంచలనం సృష్టిస్తోంది. 26 ఏళ్ల కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ‘అబ్సెషన్’ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇప్పటివరకు మన దేశంలో రూ.79 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2026లో అతిపెద్ద హాలీవుడ్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.7.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, భారీ అంచనాలతో విడుదలైన ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ వసూళ్లను అధిగమించడం విశేషం. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో ‘అబ్సెషన్’ ప్రస్తుతం 28వ స్థానంలో ఉంది. ఇదే జోష్ తో మరో కోటి రూపాయలు వసూలు చేస్తే ‘అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ రికార్డును కూడా బ్రేక్ చేయడం ఖాయం.
ఈ సినిమా విజయంపై యూట్యూబర్, డైరెక్టర్ కర్రీ బార్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్‌లో తన సినిమాకు ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుందని తాను ఊహించలేదని అన్నారు. ప్రేక్షకులు సినిమాలోని సన్నివేశాలను రీక్రియేట్ చేస్తూ కామెడీ వీడియోలు చేయడం, ఫ్యాన్ ఆర్ట్ గీయడం వంటివి చూసి షాక్‌కు గురైనట్లు చెప్పారు. ఈ విజయం అల్గారిథమ్‌ల కంటే ఫిలిం మేకర్స్‌పై నమ్మకం పెంచడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంలోనే యువ దర్శకులు మంచి కాంట్రాక్టులు, క్రియేటివ్ కంట్రోల్ సాధించుకోవాలని సూచించారు. కాగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 334 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసింది.
షార్లెట్, నార్త్ కరోలినా: ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి రంగం…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్…
సౌత్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.…
కోలీవుడ్‌లో హిట్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు నిర్మాతగా మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’…
టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'పెద్ది'. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు…