Find Articles

అట్లాంటాలో ఘనంగా మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026

అట్లాంటాలో ఘనంగా మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026

అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆశీస్సులతో జరిగే ఈ వేడుకలకు తెలుగు కుటుంబాలు, కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ సంబరాలను జరుపుకోవాలని నిర్వాహకులు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బతుకమ్మ పాటలు, కోలాటం, డాన్స్, ఫ్యాషన్ వాక్తో పాటు చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ గేమ్స్ నిర్వహించనున్నారు. అలాగే వేడుకలకు వచ్చే అతిథుల కోసం ఉచిత విందు కూడా ఏర్పాటు చేశారు.

మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 అక్టోబర్ 10వ తేదీ శనివారం, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరగనున్నాయి. డెసానా మిడిల్ స్కూల్, ఆల్ఫారెట్టా, జార్జియా వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ బతుకమ్మ వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హాజరై విజయవంతం చేయాలని MAA నిర్వాహకులు కోరారు.

మన బతుకమ్మ వేడుకలకు మీరంతా ఆహ్వానితులే!
అందరం కలిసి బతుకమ్మను ఘనంగా జరుపుకుందాం!

మరిన్ని వివరాల కోసం:

www.manaatlanta.org

ManaTV Team