ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనలో కెప్టెన్ స్మిత్‌కు ‘డిప్రెస్డ్ స్కల్ ఫ్రాక్చర్’ అయినట్లు వైద్యులు వెల్లడించారు. పుర్రెలో విరిగిన ఎముక ముక్క మెదడుపై ఒత్తిడి కలిగించే ప్రమాదం ఉండటంతో ఆయనకు అత్యవసర వైద్యం అందించినట్లు తెలిపారు.
సౌదీ అరేబియాలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను అబుధాబిలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
కెప్టెన్ స్మిత్‌కు తలకు తీవ్ర గాయాలతో పాటు పుర్రెలో పగుళ్లు, దృష్టి సమస్యలు ఉన్నప్పటికీ చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వెల్లడించారు.
కెప్టెన్ స్మిత్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సహచరులు ఆకాంక్షిస్తున్నారు.