Categories: Movie News

కరుప్పు ఎఫెక్ట్.. సూర్య కొత్త మూవీ ‘ విశ్వనాథ్ అండ్ సన్స్’ కి భారీ బిజినెస్

కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య ‘కరుప్పు’ ( తెలుగులో వీరభద్రుడు) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. థియేటర్లలో సరికొత్త రికార్డులను సృష్టించిన ఈ సినిమా సూర్య సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య, సౌత్ క్వీన్ త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ కోర్ట్ రూమ్ యాక్షన్ డ్రామా మే 15న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం రూ. 300 కోట్ల క్లబ్ వైపు వేగంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆంధ్ర ఏరియాలో రాయలసీమ మినహాయించి ఈ సినిమాను కేవలం రూ. 3 కోట్ల రేషియోలో అడ్వాన్స్‌ల రూపంలో థియేట్రికల్ రైట్స్ ఇవ్వగా.. అది ఇప్పుడు ఏకంగా రూ. 6 కోట్ల వరకు వసూలు చేయడం విశేషం. బయ్యర్లకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టిన ఈ పరిణామం, సూర్య నెక్ట్స్ తెలుగు చిత్రం ‘ విశ్వనాథ్ అండ్ సన్స్ ’ బిజినెస్ ను ఒక్కసారిగా మార్చేసింది.

‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్‌లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ‘ విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రాజెక్టును చేస్తు్న్నారు. వెంకీ అట్లూరి మార్కెట్ వాల్యూకి, ‘వీరభద్రుడు’తో సూర్యకు తెలుగులో మళ్లీ వచ్చిన విపరీతమైన క్రేజ్ తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌కు ట్రేడ్ పరంగా డిమాండ్ ఆకాశాన్ని తాకింది. ప్రస్తుతం ఈ చిత్రం ఆంధ్రా రైట్స్ సొంతం చేసుకునేందుకు బయ్యర్స్ తీవ్రంగా పోటీ పడుతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం మేకర్స్ రూ. 10 నుంచి రూ. 12 కోట్ల రూపాయల NRA (Non-Returnable Advance) రేటును కోట్ చేస్తున్నట్లు సమాచారం.

ManaTV Team

Recent Posts

Ramesh Rallapalli: My Habits, My Discipline #rameshrallapalli #manatv

Ramesh Rallapalli: My Habits, My Discipline #rameshrallapalli #manatv #rameshrallapalli #habits #discipline #successmindset #successhabits #dailyroutine #selfdiscipline…

2 days ago

Sri Lakshmi Devi Idols – New Collection at #srigayatripoojastore #manatvlive

Sri Lakshmi Devi Idols – New Collection at #srigayatripoojastore #manatvlive #srigayatripoojastore #srilakshmidevi #lakshmideviidols #lakshmidevi #deviidols…

2 days ago

Gold Rate Today: 22K & 24K Prices | August 22 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive

Gold Rate Today: 22K & 24K Prices | August 22 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive…

2 days ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 22-08-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 22-08-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

2 days ago

Meet & Greet With MP Chamala Kiran Kumar Reddy || MANA TV

ManaTV Network USA’s Leading Telugu Media Network | Available on YuppTV OTT | Trusted by…

2 days ago

IGGA Swara Vaibhavam swaraVaibhavam #igga #manatv #telugumusic #manatv

IGGA Swara Vaibhavam swaraVaibhavam #igga #manatv swaraVaibhavam #igga #manatv #manatvusa #telugucommunity #teluguevents #telugumusic #teluguculturalprograms #telugunri…

2 days ago