ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొత్త సినిమా టైటిల్ తమిళనాడులో వివాదానికి దారితీసింది. తన 72వ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన కొత్త చిత్రం ‘సండియార్’ పేరుపై పుదియ తమిళగం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ సినిమా టైటిల్ ప్రాంతీయ, కులపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించే అవకాశం ఉందని పుదియ తమిళగం పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కె. కృష్ణస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే పేరుతో సినిమా ప్రకటించినప్పుడు వివాదం తలెత్తిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ టైటిల్ వల్ల సామాజికంగా ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, ‘సండియార్’ అనే పేరుతో గతంలో కమల్ హాసన్ ఓ సినిమాను ప్రకటించారు. అయితే అప్పట్లో పుదియ తమిళగం పార్టీ నుంచి వ్యతిరేకత రావడంతో ఆ సినిమాకు ‘విరుమాండి’గా పేరు మార్చారు. 2004లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి అదే టైటిల్‌ను తన కొత్త సినిమాకు పెట్టడంతో పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
అయితే టైటిల్‌పై వస్తున్న విమర్శలు, అభ్యంతరాలపై కమల్ హాసన్ లేదా ఆయన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నుంచి ఇప్పటివరకు అధికారిక వివరణ వెలువడలేదు. దీంతో ఈ వివాదం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 11న జరిగిన…
వెలుగుల పండుగ దీపావళి వేడుకలు లండన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలంతా ఒక్కచోట చేరి…
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీతో ముందుకొచ్చారు. విజయవాడ వేదికగా బుధవారం తన నూతన రాజకీయ పార్టీ…
ప్రొబెషనరీ డీఎస్పీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. పోలీస్ అధికారులు ఉద్యోగంలో చేరినప్పుడు ఎలాంటి…
అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకు అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
అమెరికాలోని న్యూయార్క్‌లో ఆధ్యాత్మికత, సాహిత్యం, సంగీతాల సమ్మేళనంగా ‘హర హర మహాదేవ – శివ తత్వాలు’ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు…