Categories: Movie News

చిరు జోక్యం.. ‘పర్సంటేజీ’ నిర్ణయం వాయిదా!

– తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదం
– పెద్ది చిత్రం నుంచి పర్సంటేజీ విధానం కోసం ఎగ్జిబిటర్ల డిమాండ్
– మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం

తెలంగాణ సినీ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న పర్సంటేజీ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్లు జరిపిన తాజా చర్చలు సఫలమవడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.ఇరు వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చిరంజీవి చేసిన కీలక సూచనలతో ఎగ్జిబిటర్లు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకునేందుకు అంగీకరించారు.ఈ నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ నివేదిక మేరకు ముందుకు సాగాలని సూచించారు.

తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య గత కొంతకాలంగా పర్సంటేజీ వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ‘పెద్ది’ చిత్రం నుంచే ఈ పర్సంటేజీ విధానం అమలు కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే చిరుతో సమావేశమైన ఎగ్జిబిటర్లు.. పర్సంటేజీ విధానం నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.దీంతో జూన్ 4వ తేదీన విడుదల కానున్న పెద్ది చిత్రంను రెంటల్ విధానంలోనే ప్రదర్శించనున్నారు.జూన్ 30వ తేదీ తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సంటేజీ విధానం వర్తింపజేస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.

ManaTV Team

Recent Posts

‘కలర్స్’ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్టర్‌తో ఏడడుగులు!

'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…

14 minutes ago

అర్జెంటీనా అద్భుత విజయం.. మెస్సీ కన్నీళ్లు !!

ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…

15 hours ago

సౌరవ్ గంగూలీ బయోపిక్.. ‘దాదా’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…

15 hours ago

అమెరికా 250 ఏళ్ల చరిత్ర.. టామా 45 ఏళ్ల ప్రస్థానం! ఒకే వేదికపై అద్భుతమైన ‘ఆర్ట్ ఎగ్జిబిషన్’

జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…

17 hours ago

అల్లు అర్జున్‌కి నో చెప్పిన ‘బ్లాస్ట్’ బ్యూటీ.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…

19 hours ago

‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

కన్నడ స్టార్ యశ్‌ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…

22 hours ago