Categories: Movie News

త్వరలో అర్జున్ దాస్ పెళ్లి.? సీక్రెట్ గా ఆ నటితో ఎంగేజ్‎మెంట్

గంభీరమైన గొంతు, సీరియస్ యాక్టింగ్ తో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న నటుడు అర్జున్ దాస్.ఆయన త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అర్జున్ దాస్ ఒక నటితో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే రహస్యంగా వీరి నిశ్చితార్ధం జరగబోతుందని ప్రచారం జోరందుకుంది.

అర్జున్ దాస్ పై ఇలాంటి రూమర్స్ రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఆయనకు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీతో ప్రేమ వ్యవహారం నడిచిందని, ఆ తరువాత బ్రేకప్ అయిందంటూ రూమర్స్ వినిపించాయి. అయితే అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చారు. అటు అర్జున్ దాస్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా.? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా.? అనే ప్రశ్నలు అసలు పెళ్లే చేసుకోనని బదులిచ్చిన సంగతి తెలిసిందే.ఆ సమయంలోనే సుమారు నెల రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయానంటూ అర్జున్ దాస్ ఓ స్టేట్మెంట్ ఇవ్వడం అప్పటిలో వైరల్ గా మారింది.

తాజాగా మరో నటితో అర్జున్ దాస్ పెళ్లి అంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ ఈసారి అతని టీమ్ వెంటనే స్పందించింది. పుకార్లకు చెక్ పెట్టింది. అర్జు్ దాస్ పెళ్లి గురించి వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.ప్రస్తుతం అర్జున్ దాస్ చేతిలో ‘లవ్’, ‘వన్స్ మోర్’ అనే సినిమాలు ఉన్నాయి. ‘లవ్’ సినిమాలో నటి ఐశ్వర్య లక్ష్మితో కలిసి నటించగా.. ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఇక ‘వన్స్ మోర్’ సినిమాలో డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.

ManaTV Team

Recent Posts

‘కలర్స్’ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్టర్‌తో ఏడడుగులు!

'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…

1 hour ago

అర్జెంటీనా అద్భుత విజయం.. మెస్సీ కన్నీళ్లు !!

ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…

16 hours ago

సౌరవ్ గంగూలీ బయోపిక్.. ‘దాదా’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…

16 hours ago

అమెరికా 250 ఏళ్ల చరిత్ర.. టామా 45 ఏళ్ల ప్రస్థానం! ఒకే వేదికపై అద్భుతమైన ‘ఆర్ట్ ఎగ్జిబిషన్’

జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…

18 hours ago

అల్లు అర్జున్‌కి నో చెప్పిన ‘బ్లాస్ట్’ బ్యూటీ.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…

20 hours ago

‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

కన్నడ స్టార్ యశ్‌ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…

23 hours ago