తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో – TCAGT ఆధ్వర్యంలో ఆగస్టు 30న మిస్సిసాగా వ్యాలీ కమ్యూనిటీ సెంటర్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ కవి, రచయిత, విద్యావేత్త, శ్రీ బండ్ల మాధవరావు గారిని ఘనంగా సన్మానించారు. ఆయన సతీమణి డాక్టర్ ఉమారాణి గారిని కూడా శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.
కార్యక్రమంలో TCAGT అధ్యక్షులు శివ ఎల్లాల, ట్రస్టీ దేవి చౌదరి, సీనియర్ అడ్వైజర్ సూర్య బెజవాడ, కార్యదర్శి ప్రవళిక కూనతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య పరిరక్షణ కోసం TCAGT చేస్తున్న కృషిని వక్తలు వివరించారు. గిడుగు రామమూర్తి పంతులు తెలుగు భాషను సామాన్య ప్రజలకు మరింత చేరువ చేయడంలో చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ బండ్ల మాధవరావు గారు తన ప్రసంగంలో తెలుగు భాష గొప్పతనం, సాహిత్య విలువలు, భావితరాలకు భాషను అందించాల్సిన బాధ్యత గురించి వివరించారు.
తన ప్రసిద్ధ రచన ‘పొలం గట్ల వెంట’ నుంచి కొన్ని కవితలను ప్రస్తావిస్తూ వాటిలోని సామాజిక, తాత్విక అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అనంతరం జరిగిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో సాహిత్యం, విద్య, తెలుగు భాష పరిరక్షణ, సామాజిక బాధ్యతలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది.
అలాగే కెనడాకు APNRT స్టేట్ కోఆర్డినేటర్‌గా నియమితులైన రియాజ్ అలీ గారిని కూడా ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వాలంటీర్లు, స్పాన్సర్లు, కమ్యూనిటీ సభ్యులకు TCAGT నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య వారసత్వాన్ని కెనడాలో భావితరాలకు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని TCAGT ప్రతినిధులు తెలిపారు. గత 40 ఏళ్లకు పైగా తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం TCAGT సేవలు అందిస్తోంది.
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఇన్‌ఫెక్షన్, డీహైడ్రేషన్ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం…
గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం 6E 2102లో ఇంజిన్‌కు సంబంధించిన సమస్య తలెత్తడంతో విమానాన్ని తిరిగి గోవాకు…
Gold Rate Today : 22K & 24K Prices Sep 1 #short #goldrate #24kgold #22kgold #goldprice…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 01-09-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
విశాఖపట్నంలో సుమారు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో AIG హాస్పిటల్ నిర్మాణం చేపడుతోంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి…