Categories: Telangana

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. కానీ

తెలంగాణ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచింది. ఇకపై 34 సంవత్సరాలకు బదులుగా 44 సంవత్సరాల వయస్సు వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అర్హులు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో నంబర్ 86 ను జారీ చేసింది.అయితే ఈ పెరిగిన వయోపరిమితి శాశ్వతం కాదు. ఏడాది కాలం పాటు మాత్రమే అమలులో ఉంటుంది.

2024 ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో నంబర్ 30 ప్రకారం వయోపరిమితిని 10+2 సంవత్సరాలు పెంచి, 46 ఏళ్లకు చేర్చింది. అది రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది.ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన జీవో నంబర్ 30 ప్రకారం కాలపరిమితి ముగిసింది. దీంతో ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితి తిరిగి 34 ఏళ్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో జీవో 86 ను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.నిరుద్యోగ యువత నుండి అందిన విజ్ఞప్తుల నిశితంగా పరిశీలించిన తర్వాత తాజా నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు తెలిపారు.

ఈ జీవోలో యూనిఫాం సర్వీసులను మినహాయించారు. పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక దళం, జైళ్లు, అటవీ శాఖల్లో ఉద్యోగాలను ఇందులో నుంచి మినహాయించారు. ఆయా శాఖల్లో ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థుల వయోపరిమితి 34 సంవత్సరాలుగానే కొనసాగుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే యూనిఫాం రహిత పోస్టుల నియామకాలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది.

ManaTV Team

Share
Published by
ManaTV Team

Recent Posts

కొడుకు కోసం కాజల్ అగర్వాల్ డెసిషన్..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…

14 hours ago

విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ రిపోర్ట్..క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…

15 hours ago

యాక్షన్ మోడ్‌లోకి చిరు.. హైదరాబాద్‌లో భారీ ఫైట్ సీక్వెన్స్ షురూ

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్…

15 hours ago

జెట్ స్పీడ్ లో అనిల్ రావిపూడి సినిమా.. షూటింగ్ లో పాల్గొన్న వెంకీ

టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ జెట్ స్పీడ్ లో…

17 hours ago

బిగ్ సర్‎ప్రైజ్.. ‘లెనిన్’ కు ఎన్టీఆర్ వాయిస్

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…

20 hours ago

సైకో మైండ్.. సియా గోయల్ పై సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్!!

పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…

20 hours ago