ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది. మద్యం పాలసీ కేసు విచారణకు సంబంధించి జస్టిస్ స్వర్ణకాంత శర్మను ప్రణాళిక ప్రకారం సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ రవీందర్ దుడేజాలతో కూడిన ధర్మాసనం ముగ్గురికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.నాలుగు వారాల్లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది.
మద్యం పాలసీ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, వారి మద్దతుదారులు లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, వీడియోలు పెట్టారు. ఓ విద్యాసంస్థలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ మాట్లాడిన పాత వీడియోను ఎడిట్ చేసి, ఆమె ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగా తప్పుడు ప్రచారానికి తెరతీశారు.ఆమె ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించలేరని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.ఆ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ తనపై దుష్ప్రచారం సాగించారనే ఆరోపణలపై స్వచ్ఛందంగా కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించారు. అదే సమయంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్…
టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…