Categories: Movie News

దర్శకుడిగా విశాల్.. యాక్షన్ మోడ్‌లో ‘మకుటం’ టీజర్‌

యాక్షన్ హీరో విశాల్ దర్శకుడిగా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మకుటం’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్ యాక్షన్ లవర్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

మండుతున్న శవం నుంచి సిగరెట్ వెలిగించుకుంటూ విశాల్ ఇచ్చిన ఎంట్రీ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో విశాల్ మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. టీజర్‌లో చూపించిన మూడు లుక్స్ కూడా ఆయన నట విశ్వరూపాన్ని సూచిస్తున్నాయి. హీరోయిన్ అంజలి పాత్ర కూడా చాలా భిన్నంగా ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఆమె కూడా మాస్ యాక్షన్ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి సమర్పణలో ఈ చిత్రం 99వ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు ప్రాణం పోయగా, రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్‌లా అనిపించింది.

మొత్తం మీద, ఈ టీజర్‌తో ‘మకుటం’ విశాల్ కెరీర్‌లోనే ఓ ప్రత్యేక చిత్రంగా నిలవబోతోందని అర్ధం అవుతుంది. విశాల్ త్రిపాత్రాభినయం, దర్శకత్వ ప్రతిభ, అంజలి కొత్త లుక్, బలమైన సాంకేతిక బృందం సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ManaTV Team

Recent Posts

M4M’s Mohan Vadlapatla and Jo Sharma Win Best Debut Awards at ANDHRAPRADESH FILM CHAMBER OF COMMERCE

Mohan Vadlapatla Honoured as Best Debut Director, While Jo Sharma Receives Best Debut Heroine Award…

3 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

10 hours ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold#goldprice#manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…

11 hours ago

అక్టోబర్ 11న నాట్స్ మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…

23 hours ago

AI పేరు మారుస్తామన్న ట్రంప్.. ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా పిలవాలంటూ ప్రతిపాదన!

కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…

23 hours ago

ప్రాణాలకు తెగించి 170 మందిని కాపాడిన భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం!

భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…

23 hours ago