మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ పెద్ది’. బాలీవుడ్ బ్యూటీ నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. చిత్ర యూనిట్ బెంగళూరులో ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, రామ్ చరణ్ యాక్టింగ్ పై, సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ పెద్ది’ చిత్రంలో నటనకు గాను రామ్ చరణ్ కు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని జోస్యం చెప్పారు. రామ్ చరణ్ ఎంతో కష్టపడి, నిజాయితీతో ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. తల్లిదండ్రులు, పవన్ కల్యాణ్, మెగా అభిమానుల ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఒక కార్యక్రమంలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పక్కపక్కనే కూర్చున్నప్పుడు వారి మధ్య ఉన్న ఆప్యాయత ఎంతగానో కదిలించిందన్న ఆయన ఆ బంధం తనకు, తన తమ్ముడు పునీత్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసిందని చెప్పారు. చరణ్ అంటే చాలా ఇష్టమని, ‘పెద్ది’ పాత్ర కోసం ఆయన పడిన కష్టం, ఆయన నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే” అని ప్రశంసించారు.
సినిమాలోని తన పాత్ర గురించి వివరించిన శివరాజ్ కుమార్.. ‘పెద్ది’ ప్రయాణంలో ఎన్నో పాత్రలు ఉన్నాయని తెలిపారు. అందులో గౌర్ నాయుడు అనే ఒక కోచ్ తరహా పాత్ర తనదని పేర్కొన్నారు.. పెద్ది, గౌర్ నాయుడు మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ అనుభూతిని థియేటర్లలోనే పొందాలి. ఈ పాత్ర ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోతుంది” అని అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు తన పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని, నిర్మాత సతీష్, కెమెరామెన్ రత్నవేలు తనకు ఎంతో ప్రేమ చూపించారని తెలిపారు. ప్రస్తుతం తాను ‘గుమ్మడి నర్సయ్య’, ‘జైలర్ 2’ చిత్రాల్లో నటిస్తున్నానని, మంచి కథలు వస్తే తప్పకుండా మరిన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తానని శివరాజ్ కుమార్ స్పష్టం చేశారు.
ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 8-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
Don’t wait until you see the SOLD OUT announcement! Book your tickets now and join…
Saraswathi Puja – Devi Navaratri Celebrations Hindu Temple of Atlanta invites all devotees to participate…
We are hosting FREE GENAI TRAINING for everyone. Nov 7th – Nov 29th, 2026 100%…