Categories: Movie News

‘పెద్ది’ అరుదైన ఘనత.. ఆస్ట్రేలియాలో తొలి చిత్రంగా..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, ఓవర్సీస్‌లో మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియాలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అక్కడున్న ప్రముఖ సినిమా చైన్ ‘హోయిట్స్’కు సంబంధించిన అన్ని లొకేషన్లలోనూ రిలీజ్ కాబోతున్న తొలి చిత్రంగా ‘పెద్ది’ చరిత్ర సృష్టించనుంది.

ఈ సినిమాను న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా ఓవర్సీస్ పంపిణీ చేస్తోందని తెలుస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలు కూడా ఎంపిక చేసిన కొన్ని హోయిట్స్ థియేటర్లలో మాత్రమే విడుదలవుతాయి. కానీ, ‘పెద్ది’ చిత్రాన్ని ఆస్ట్రేలియాలోని అన్ని హోయిట్స్ సెంటర్లలోనూ ప్రదర్శించనుండటం విశేషం. ఇది తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆదరణకు నిలువెత్తు నిదర్శనం.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ భారీ విడుదల ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

ManaTV Team

Recent Posts

కొడుకు కోసం కాజల్ అగర్వాల్ డెసిషన్..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…

16 hours ago

విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ రిపోర్ట్..క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…

17 hours ago

యాక్షన్ మోడ్‌లోకి చిరు.. హైదరాబాద్‌లో భారీ ఫైట్ సీక్వెన్స్ షురూ

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్…

17 hours ago

జెట్ స్పీడ్ లో అనిల్ రావిపూడి సినిమా.. షూటింగ్ లో పాల్గొన్న వెంకీ

టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ జెట్ స్పీడ్ లో…

19 hours ago

బిగ్ సర్‎ప్రైజ్.. ‘లెనిన్’ కు ఎన్టీఆర్ వాయిస్

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…

22 hours ago

సైకో మైండ్.. సియా గోయల్ పై సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్!!

పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…

22 hours ago