– అమెరికాలో ఉన్న తెలుగు వారి కోసం ప్రత్యేక వేడుక
– సంగీతం, సాహిత్యం, హాస్యాన్ని మిళితం చేస్తూ, తెలుగుదనం ఉట్టిపడేలా షో
– ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను పురస్కరించుకుని వినూత్న కార్యక్రమం జరిగింది. అమెరికాలోనే మొట్టమొదటిసారిగా టీమ్ అనంతం – యూఎస్ఏ టూర్ పేరుతో సంగీతం, సాహిత్యం, హాస్యం ( ఎంఎల్సీ- మ్యూజిక్, లిటరేచర్, కామెడీ) కలబోసిన త్రివేణి సంగమంలా ఈ వేడుక సాగింది.
ఈ నెల 9న లీస్ బర్గ్ లోని జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో ఈ షో జరగ్గా.. వందలాది మంది పెద్దలు, చిన్నారులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సంగీతం, సాహిత్యంతో పాటు హాస్య కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయని జీడబ్ల్యూటీసీఎస్ సంస్థ అధ్యక్షులు రవి అడుసుమిల్లి తెలిపారు. తెలుగు భాషను సజీవంగా నిలబెడుతున్న వేదికలు, సంఘాలలో అగ్ర తాంబూలం బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘానికి దక్కుతుందని చెప్పారు. స్వర్ణోత్సవాలను జరుపుకున్న ఈ సంస్థ, యువ వారసత్వంతో మరో స్వర్ణోత్సవ కాలం పాటు ఈ పరంపరను కొనసాగిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తున్న దాతలను, యువ వాలంటీర్లను ఈ సందర్భంగా అభినందించారు.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…