– అమెరికాలో ఓపీటీ దుర్వినియోగం..
– 10 వేల మంది విదేశీ విద్యార్థుల గుర్తింపు
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిఘాను పెంచింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) విధానాన్ని దుర్వినియోగం చేస్తున్న సుమారు 10 వేల మంది విదేశీ విద్యార్థులను గుర్తించినట్లు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తెలిపింది. వీరిలో అనేకమంది భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం.
ఓపీటీ దుర్వినియోగంపై యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ సెక్యూరిటీ దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొంది. దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఓపీటీ నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు అమెరికాలోని సంస్థల నుంచే శిక్షణ పొందాలి. కానీ, చాలామంది భారత్‌లోని ఉద్యోగుల పర్యవేక్షణలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.అదేవిధంగా తప్పుడు పత్రాలతో అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగించుకుంటున్నట్లు కూడా విచారణలో తేలిందని వెల్లడించారు. ఓపీటీ కింద అమెరికాలో పనిచేసే విద్యార్థుల సంఖ్య అంచనాలకు మించి లక్షల్లోకి చేరిందని, అలాగే మోసాలు పెరిగాయని అధికారులు తెలిపారు.
ఓపీటీ అంటే ఏమిటి.?
అమెరికాలో F-1 స్టూడెంట్ వీసాతో చదువుతున్న విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయ్యాక పని అనుభవం కల్పించే విధానాన్నే ఓపీటీ అంటారు.ఇది సాధారణంగా ఏడాది పాటు ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సులు పూర్తి చేసిన వారికి అదనంగా 24 నెలల పొడిగింపు లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు అమెరికన్ కంపెనీల్లో పనిచేసి అనుభవం సంపాదిస్తారు.వీరిలో చాలామంది తరువాత H-1B ఉద్యోగ వీసాకు మారే అవకాశాన్ని కూడా పొందుతున్నారు. అందుకే అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు ఓపీటీ అనేది చాలా కీలకంగా మారింది.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్…
టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…