Categories: Sports

వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టు గెలుపే ముఖ్యం ..వైభవ్ సూర్యవంశీ

రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్ తోనే కాదు మాటలతోనూ ఆకట్టుకుంటున్నారు. వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు విజయానికే తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఈ స్ఫూర్తి తనకు తన తండ్రి నుంచి వచ్చిందని స్పష్టం చేశారు.

చిన్నప్పటి నుంచి తన తండ్రి ఒకే మాట చెప్పేవారు. సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ చేసినా.. ఆ పరుగుల వల్ల జట్టు గెలవకపోతే అవి వ్యర్థం. అవి కేవలం వ్యక్తిగత రికార్డులకు పనికొస్తాయి తప్ప జట్టుకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పేవారు. అందుకే, గెలిపించలేని సెంచరీ కంటే, జట్టును గెలిపించే 80 పరుగులే ఎక్కువ విలువైనవి అని వైభవ్ తెలిపారు. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజారినప్పటికీ, తన దృక్పథం మారలేదని వెల్లడించారు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. 15 ఇన్నింగ్స్‌లలో 242.86 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసకర బ్యాటింగ్ చేస్తూ 680 పరుగులు సాధించారు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచారు. ఈ క్రమంలో 65 సిక్సర్లు బాదిన వైభవ్, ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు, 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో 600కు పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించారు.

ManaTV Team

Recent Posts

Jo Sharma won Best Debut Heroine Award for M4M by APFCC Film Chambers

American Actress Jo Sharma got BEST DEBUT HEROINE AWARD for M4M Movie & Mohan Vadlapatla…

3 hours ago

7 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానానికి పిడుగు.. సేఫ్‌గా ల్యాండింగ్

పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు…

7 hours ago

హూతీ స్థావరాలపై సౌదీ కూటమి భారీ దాడులు

యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని…

7 hours ago

ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రం

ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. 15…

7 hours ago

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…

14 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

15 hours ago