Categories: Sports

గుజరాత్ వర్సెస్ రాజస్థాన్.. ఐపీఎల్ క్వాలిఫయర్ 2కు వర్షం ముప్పు?

ఐపీఎల్ 2026 సీజన్‌లో కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫైనల్ బెర్త్ కోసం న్యూ చండీగఢ్‌లోని పీసీఏ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే చండీగఢ్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందనే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య చండీగఢ్‌లో వర్షం పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం పూట వాతావరణం నిర్మలంగా ఉన్నప్పటికీ, సమీపంలోని హర్యానా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న టీమ్ ఫైనల్‌కు వెళ్తుంది. ఈ లెక్కన పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో ఉన్న గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

ManaTV Team

Recent Posts

Jo Sharma won Best Debut Heroine Award for M4M by APFCC Film Chambers

American Actress Jo Sharma got BEST DEBUT HEROINE AWARD for M4M Movie & Mohan Vadlapatla…

2 hours ago

7 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానానికి పిడుగు.. సేఫ్‌గా ల్యాండింగ్

పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు…

6 hours ago

హూతీ స్థావరాలపై సౌదీ కూటమి భారీ దాడులు

యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని…

6 hours ago

ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రం

ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. 15…

6 hours ago

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…

13 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

14 hours ago