లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, నాగ్ అశ్విన్ నిర్మించిన చిత్రం ‘సింగ్ గీతం’. ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్టులో చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపిన చిరు, సింగీతంని తెలుగు పరిశ్రమ ‘భీష్మాచార్యుడు’గా అభివర్ణించారు.
“శ్రీ సింగీతం శ్రీనివాసరావు తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించారు. వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ నెల 12వ తేదీన ‘సింగ్ గీతం’ సినిమా విడుదలై, భారతీయ సినీ చరిత్రలో మరొక మైలురాయిగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.
అదేవిధంగా ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ఆలోచనతో ఈ సినిమాను నిర్మించిన నాగ్ అశ్విన్ ను కూడా చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ఓవైపు ఆ నాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు, మరోవైపు ఈ తరం ఆలోచనలను ప్రతిబింబించే నాగ్ అశ్విన్.. వీరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే ఈ చిత్రంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు” అని చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
Mohan Vadlapatla Honoured as Best Debut Director, While Jo Sharma Receives Best Debut Heroine Award…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…