Find Articles

మైండ్ బ్లోయింగ్ ..‘వారణాసి’లో రామాయణ సీక్వెన్స్..!

మైండ్ బ్లోయింగ్ ..‘వారణాసి’లో రామాయణ సీక్వెన్స్..!

దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమాల్లో పురాణాల టచ్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలిలో శివుడి ఎలివేషన్ అయినా, ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ లో రామ్ చరణ్ రాముడి గెటప్ అయినా.. ఆ సీన్లు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’. ఇందులో రామాయణం ఆధారంగా ఓ స్పెషల్ ఎపిసోడ్‌ను రాజమౌళి ప్లాన్ చేశారనే టాక్ నడుస్తోంది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా అది 15 నిమిషాల సీక్వెన్స్ కాదట.. ఏకంగా 25 నిమిషాల పాటు సాగే విజువల్ వండర్ అని ప్రచారం జోరందుకుంది. అంతేకాదు ఈ భారీ ఎపిసోడ్ కోసం చిత్ర యూనిట్ దాదాపు 60 రోజుల పాటు నిరంతరం షూటింగ్ చేసిందని సమాచారం. రామాయణంలోని కీలక ఘట్టాలను కలిపి రూపొందిస్తున్న ఈ సీక్వెన్స్.. ఒక చిన్న సినిమా తీసినంత భారీ స్థాయిలో తీశారని తెలుస్తోంది.

ఇక ఈ 25 నిమిషాల ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన భారీ మోషన్ క్యాప్చర్ ఫెసిలిటీని ఉపయోగించినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ లెవల్ టెక్నాలజీతో, ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్స్ పర్యవేక్షణలో ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించారని సమాచారం. టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే అడ్వెంచరర్ పాత్రతో పాటు రాముడిగా కనిపించనున్నారని టాక్. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉండగా.. ఇప్పుడు రామాయణ ఎపిసోడ్ న్యూస్ తో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయింది.

ManaTV Team