
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 17 నుంచి 19 వరకు నిర్వహించనున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్‌కు ప్రముఖ టెలివిజన్ యాంకర్లు సుమ కనకాల, రవి, మామ మహేష్ వ్యాఖ్యాతలుగా సందడి చేయనున్నారు.
తమ చమత్కార వ్యాఖ్యానం, వినోదభరిత శైలితో ప్రేక్షకులను అలరించే ఈ ముగ్గురు యాంకర్లు మూడు రోజుల పాటు జరిగే సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు లావణ్య శ్రీనాథ్, శ్వేత కొమ్మోజి, సౌమ్య శ్రీ కూడా వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు.
జూలై 17–19 తేదీల్లో జరిగే ఈ మెగా కన్వెన్షన్‌లో సినీ ప్రముఖులు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార సదస్సులు, యువజన, మహిళా, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీఏ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది తెలుగు ప్రజలు ఈ మహాసభలకు హాజరుకానున్నారు.

