Find Articles

జానీ మాస్టర్-శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలపై క్లారిటీ..

జానీ మాస్టర్-శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలపై క్లారిటీ..

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో జానీ మాస్టర్ స్పందించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.

శేఖర్ మాస్టర్ తనకు అన్నలాంటి వ్యక్తి అని, తమ మధ్య అన్నదమ్ముల అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. అసత్య ప్రచారాలు, తప్పుడు వీడియోలను నమ్మవద్దని అభిమానులను కోరారు.  ఈ పుకార్లు మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన స్వయంగా స్పందించినట్లు జానీ మాస్టర్ వెల్లడించారు. ఒక సినిమా షూటింగ్ సెట్స్‌లో తమ ఇద్దరినీ పిలిపించి మాట్లాడారని, అనంతరం తాను, శేఖర్ మాస్టర్ కలిసి చిరంజీవితో సంతోషంగా భోజనం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి చూపిన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెట్స్‌లో కలిసి దిగిన ఫొటోలను కూడా జానీ మాస్టర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

జానీ మాస్టర్ వివరణతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విభేదాల ప్రచారానికి తెరపడింది. అభిమానులు, సినీ వర్గాలు కూడా ఈ వివరణను స్వాగతిస్తూ, ఇద్దరు కొరియోగ్రాఫర్లు ఇలాగే కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాయి.

ManaTV Team