Find Articles

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్‌’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్‌’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

‘బేబీ’ బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘EPIC First Semester’ (ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్). ’90s వెబ్ సిరీస్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది.. చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది’ అనే పాట రిలీజైంది.

‘ప్రియసఖి..’ అంటూ సాగే కొత్త మెలోడియస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ రొమాంటిక్ ట్రాక్‌కు సురేశ్ బానిశెట్టి లిరిక్స్‌ అందించగా.. ప్రముఖ సింగర్ కేఎస్‌ హరిశంకర్‌ ఆలపించారు. పాటలోని “సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది.. చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది.. భూమికి తెలియని మట్టి వాసనిది ఏమిది ఏమిది” అనే లైన్లు ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే “జీవితాన్ని మార్చేసావే బుజ్జి నెమలి.. స్వర్గంలోతూ చూపించవే పూలకడలి” అంటూ హీరో తన ప్రేయసిని పొగిడే విధానం యువతకు కనెక్ట్ అయ్యేలా ఉంది..

ప్రస్తుతం విడుదలైన ఈ ‘ప్రియసఖి’ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో, మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక గతంలో ‘బేబీ’ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల కెమిస్ట్రీ, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించగా… ఇప్పుడు మళ్లీ అదే క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో టాలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఏర్పడింది.

 

ManaTV Team