
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బెంగళూరులో తన లేటెస్ట్ మూవీ ‘ పెద్ది’ ప్రమోషన్లలో భాగంగా ఆమె ధరించిన డ్రెస్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సాంప్రదాయ బెనారసీ వస్త్రానికి ఆధునిక హంగులు జోడించి రూపొందించిన గౌనులో జాన్వీ భారతీయ యువరాణిలా మెరిసిపోయారు.
సాధారణంగా ప్రతి ఒక్కరికీ బెనారసీ అంటే చీరనే గుర్తుకువస్తుంది. కానీ, జాన్వీ దానికి పూర్తి భిన్నంగా స్ట్రాప్‌లెస్ గౌనును ఎంచుకున్నారు. కార్సెట్ తరహా బాడీస్‌తో, ఫిట్‌గా ఉండే ఈ గౌను ఆమె అందాన్ని మరింత పెంచింది. లేత గులాబీ, మింట్, ఐవరీ వంటి పాస్టెల్ రంగుల కలయిక, బంగారు వర్ణంతో నేసిన పూల డిజైన్లు ఈ డ్రెస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనికి తోడు చేతులపై కప్పుకున్న షీర్ పాస్టెల్ దుపట్టా గ్రాండ్ లుక్‌ను ఇచ్చింది. ఈ డ్రెస్‌కు తగ్గట్టుగా జాన్వీ ఆక్సీడైజ్డ్ సిల్వర్ జుంకాలు, స్టేట్మెంట్ ఇయర్ కఫ్ వంటి మినిమల్ యాక్సెసరీస్ ధరించారు.

