Find Articles

ఫ్రిస్కో మేయర్ రేసు: “Americans 4 Hindus” ఈవెంట్‌లో అభ్యర్థి రాడ్ విల్‌హౌయర్ సంచలన వ్యాఖ్యలు!

ఫ్రిస్కో మేయర్ రేసు: “Americans 4 Hindus” ఈవెంట్‌లో అభ్యర్థి రాడ్ విల్‌హౌయర్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగర మేయర్ ఎన్నికల రేసులో కీలక అభ్యర్థిగా ఉన్న రాడ్ విల్‌హౌయర్ భారతీయ కమ్యూనిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. “Americans 4 Hindus” ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నగర అభివృద్ధి, ప్రజా భద్రత, మౌలిక సదుపాయాల మెరుగుదల, సమర్థవంతమైన పన్నుల నిర్వహణ వంటి అంశాలపై తన ప్రణాళికలను వివరించారు.

ఫ్రిస్కో భవిష్యత్తుపై తన విజన్‌ను పంచుకున్న రాడ్, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భారతీయ కమ్యూనిటీతో మరింత సన్నిహితంగా పనిచేస్తూ నగరాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు, అభిప్రాయాలను వ్యక్తం చేశారు. “Frisco First” నినాదంతో బరిలోకి దిగిన రాడ్ విల్‌హౌయర్, బలమైన నాయకత్వం – బలమైన సమాజం – మరింత బలమైన ఫ్రిస్కో లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

 

 

ManaTV Team