Find Articles

నేటి తరం ప్రేమ ఓయో రూమ్ లలో ఎండ్ అవుతుంది.. అల్లు అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్

నేటి తరం ప్రేమ ఓయో రూమ్ లలో ఎండ్ అవుతుంది.. అల్లు అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్

‘శుభం’ ఫేమ్ హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దీవాన’. శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈనెల19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేయగా.. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. వన్ సైడ్ లవర్స్ కి డేడికేట్ చేస్తూ వచ్చిన ఈ ట్రైలర్ మెయిన్ గా యూత్ ని ఆకట్టుకుంటుంది. ‘చచ్చేంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదురా..’, ‘ఎంతగొప్ప లవ్‌స్టోరీ అయినా.. వన్‌ సైడ్ లవ్‌తోనే మొదలవుతుందిరా’ వంటి డైలాగులు ట్రెండ్ అవుతున్నాయి.

AAA సినిమాస్ లో నిర్వహించిన ఈ ఈవెంట్ కు హీరో విశ్వక్ సేన్, సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దీవాన’ సినిమా వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది కాబట్టి, ఇవాళ మీ లవ్ స్టోరీ చెప్పాలని అల్లు అరవింద్ ని విశ్వక్ సేన్ అడిగారు. దానికి స్పందించిన ఆయన తనకు చాలా ప్రేమ కథలు ఉన్నాయన్నట్లు నవ్వేశారు. తర్వాత ‘వన్ సైడ్ అన్నాక ఎన్నైనా ఉంటాయి. ఇవాళ ‘లవ్’ అంటే జనం లేని సినిమాలకు వెళ్లి, కార్నర్ సీట్లలో కూర్చొని, ఆ తర్వాత రెండు షాపింగులకి వెళ్లి, ఓయో రూమ్ లో ఎండ్ అవుతుంది” అని అల్లు అరవింద్ నవ్వుతూ చెప్పారు. విశ్వక్ సేన్ – అల్లు అరవింద్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ManaTV Team