Find Articles

సాంగ్ ప్యాకప్.. రష్మిక ‘మైసా’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

సాంగ్ ప్యాకప్.. రష్మిక ‘మైసా’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’. ఈ చిత్రం నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని కీలకమైన పాట చిత్రీకరణ పూర్తయినట్లు డైరెక్టర్ రవీంద్ర పుల్లే తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సెట్స్‌కు సంబంధించిన ఫోటోను పంచుకున్న ఆయన, “#Mysaa సాంగ్ ప్యాకప్” అని పోస్ట్ చేశారు.

ఇటీవల కేరళలో ఈ సినిమాకు సంబంధించి ఒక సుదీర్ఘ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇందులో స్టంట్ మాస్టర్ కెచా కంపాక్డీ పర్యవేక్షణలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించగా.. రష్మిక స్వయంగా కొన్ని హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించారని సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాల్లో సహజంగా నటించేందుకు రష్మిక థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అక్కడ రోజూ 8 గంటల పాటు శ్రమించి, అంతర్జాతీయ నిపుణుల వద్ద అధునాతన స్టంట్స్, హ్యాండ్-టు-హ్యాండ్ కంబాట్ వంటివి నేర్చుకున్నారు.

ఈ మూవీలో రష్మిక ఒక గిరిజన (గోండు) యువతి పాత్రలో కనిపించనున్నారు. రష్మికతో పాటు ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రేయాస్ పి కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ManaTV Team