Find Articles

గ్రీస్‌లో కుటుంబంతో సందడి చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

గ్రీస్‌లో కుటుంబంతో సందడి చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంతో కలిసి గ్రీస్‌లో సరదాగా గడిపారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుకకు హాజరైన ఆయన, అనంతరం సతీమణి లత, కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య, మనవళ్లతో కలిసి ఏథెన్స్ నగరంలో సందడి చేశారు.

ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సౌందర్య రజనీకాంత్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తున్న రజనీకాంత్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కుటుంబ సభ్యులతో సూపర్ స్టార్ గడిపిన ఈ ఆనందకర క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ManaTV Team