Find Articles

రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్.. ఓవర్సీస్‌లో ‘మా ఇంటి బంగారం’ సత్తా

రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్.. ఓవర్సీస్‌లో ‘మా ఇంటి బంగారం’ సత్తా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన స్టార్‌డమ్‌ను మరోసారి చాటుకున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదల కాకముందే ఓవర్సీస్‌లో, మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రీ సేల్స్ ఇప్పటికే 3 లక్షల డాలర్ల (సుమారు రూ. 2.5 కోట్లు) మార్కును దాటేశాయి.

సమంత సినీ కెరీర్‌లోనే ప్రీ సేల్స్ ద్వారా ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. జూన్ 19న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇవాళ ప్రీమియర్స్ ప్రదర్శన నేపథ్యంలో.. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో విడుదల చేస్తోంది. బుకింగ్స్ కొనసాగుతున్నాయని, వసూళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రకటించింది.

‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి క్రియేటర్‌గా వ్యవహరించారు. సమంతతో గతంలో ‘ఓ బేబీ’ వంటి విజయవంతమైన సినిమా తీసిన నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మొత్తంగా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్, ఓవర్సీస్ మార్కెట్‌లో సమంతకు ఉన్న తిరుగులేని క్రేజ్‌ను స్పష్టం చేస్తున్నాయి.

ManaTV Team