
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ‘NBK111’. ఈ ప్రాజెక్టు నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన మేకర్స్, ఆమె బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్లో కాజల్ సింపుల్ చీరకట్టులో, కళ్లజోడు ధరించి సీరియస్ లుక్‌తో కనిపించారు. దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కాజల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సినిమా ఆమె కెరీర్లో స్పెషల్ గా నిలుస్తుందని పేర్కొంది. ‘NBK111’లో ఆమె పూర్తిస్థాయి హీరోయిన్గా, కథను కీలక మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నట్లు చర్చ జరుగుతోంది.
‘భగవంత్ కేసరి’ చిత్రం తర్వాత బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ యాక్షన్, ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

