
మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అరుదైన క్షణం వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లీంకార ముఖాన్ని ప్రపంచానికి చూపించారు.. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసిన క్లీంకార ఫొటో వైరల్ గా మారింది.
‘‘మా అమూల్యమైన చిన్నారి క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ ఉపాసన తన ఫేస్‌బుక్ ఖాతాలో అందమైన తమ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు. పచ్చని ప్రకృతి మధ్యలో రామ్ చరణ్, ఉపాసన తమ గారాల పట్టిని ప్రేమగా ఎత్తుకుని ఉన్న ఈ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నీలి రంగు దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారి అందరి చూపును కట్టిపడేస్తోంది.
ఈ పోస్ట్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. మెగా అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు క్లీంకారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మూడేళ్లుగా ఎదురుచూస్తున్న మెగా ప్రిన్సెస్ ఫేస్ రివీల్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
