
దళపతి విజయ్.. తమిళనాడు సీఎం కావడం ఏమో గానీ, ఆ టైమ్ లో హీరోయిన్ త్రిష మాత్రం వైరల్ గా మారిపోయారు. వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఉందనే రూమర్సే దీనికి ప్రధాన కారణం. అంతేకాదు త్రిష రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తారని టాక్ కూడా వినిపించింది. ఆ తరువాత విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగింది. కానీ అనూహ్యంగా వీరి బంధం ముగిసిందనే ప్రచారం సంచలనంగా మారింది.
రీసెంట్ గా విజయ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఎప్పుడూ విజయ్ కు సంబంధించిన అన్ని విషయాల్లో ముందుండే త్రిష మాత్రం ఈసారి మౌనం పాటించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ామె, విజయ్ బర్త్ డేను ఇలా పట్టించుకోకపోవడం, విసెష్ చెప్పకపోవడం వీరి బంధం ముగిసిందనే ప్రచారానికి బలాన్ని చేకూర్చింది. ఈ క్రమంలోనే ఆమె మౌనం వెనుక బలమైన కారణం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో విజయ్ తన భార్య సంగీతతో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడంతో, త్రిషను పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయి, తిరిగి కలిసిపోయారనే వార్తలు కోలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి. విజయ్ తన ఫ్యామిలీతో కలవడంతోనే త్రిష ఈ బంధం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తన పర్సనల్ లైఫ్ ను చక్కదిద్దుకుంటున్న విజయ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే, ఆమె దూరంగా ఉంటున్నారని టాక్. మొత్తంగా పెళ్లి పీటల వరకు వెళ్తుందనుకున్న ఈ క్రేజీ జోడీ స్నేహానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

