Find Articles

సమంతకు సారె.. ‘ మా ఇంటి బంగారం’ టీమ్ కు మెగా సత్కారం!

సమంతకు సారె.. ‘ మా ఇంటి బంగారం’ టీమ్ కు మెగా సత్కారం!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు కొత్త జంట సమంత, రాజ్ నిడిమోరులకు చిరంజీవి, సురేఖ దంపతులు సారె పెట్టి ఆశీర్వదించారు. ఈ ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా సమంత, రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరు దంపతులు సమంతకు చీర, ఒక శంఖాన్ని బహూకరించి, ఆత్మీయతను చాటుకున్నారు. అనంతరం కాసేపు సినిమా విజయం గురించి ముచ్చటించారు. ఈ మెగా ‘బంగారం’ మూమెంట్‌కు సంబంధించిన ఫొటోలను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది.

నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. తొలి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బృందాన్ని చిరంజీవి అభినందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ManaTV Team