
టాలీవుడ్ స్టార్ నటి సమంత జూన్ నెల జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘‘జూన్ ఫెయిరీ టేల్‌లా గడిచింది’’ అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు. వాటిలో బేబీ బంప్‌తో జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
సమంత షేర్ చేసిన ఫొటోల్లో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న చిత్రాలు, పెంపుడు శునకాలతో గడిపిన క్షణాలు, వెల్‌నెస్ ట్రిప్, ఇష్టమైన పుస్తకాలతో పాటు రోజువారీ జీవితంలో ఆస్వాదించిన మధుర క్షణాలు కనిపించాయి. కొన్ని ఫొటోల్లో ఆమె భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు కూడా కనిపించారు.
అయితే, ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో సమంత కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పనులు పూర్తయ్యాక కొంతకాలం ప్రసూతి సెలవు తీసుకుంటానన్నారు. ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమాతో అభిమానుల ముందుకు వస్తానని తెలిపారు.

