
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది.
ఈ సినిమా ప్రారంభంలో వచ్చే శ్రీరామపురం, భారతం మిట్ట ప్రపంచాన్ని పరిచయం చేసే స్పెషల్ వాయిస్ ఓవర్ ను మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అందించినట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. ‘ ఒక నమ్మకంతో పుట్టిన ప్రపంచం.. పరిచయం అవసరం లేని ఓ వాయిస్ తో మీ ముందుకు వస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.
డైరెక్టర్ మురళీ కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన అందాల భామ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్ టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ‘ లెనిన్’ సినిమా జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

